సమాజంలో కొందరు ఉంటారు పక్కవారికి సాయం చేయడానికి ఎలాంటి ఆలోచన చేయరు, ఇలాంటి వారిని మనం గౌరవించుకోవాలి, అయితే పేదలకు తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్న విషయం తెలిసిందే, సొంత ఇళ్లు లేని వారి కలలను తీర్చుతుంది కేసీఆర్ సర్కార్ …ఇప్పటికే వేలాది మందికి సొంత ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు.
ఓపక్క పూర్తి అయిన ఇళ్లను కూడా అందచేస్తున్నారు.. ఇలాంటి వేళ సిద్దిపేట జిల్లాలో ఓ మహిళ చేసిన పని అందరి చేత శభాష్ అనిపించింది..ప్రభుత్వం అందజేసిన డబుల్ బెడ్రూం ఇంటిని ఆమె తిరిగి ఇచ్చేయ్యడమే అందుకు కారణం. అదేమిటి అని ఆశ్చర్యపోతున్నారా..
తాము డబుల్ బెడ్రూం ఇంటిని ఎందుకు తిరిగి ఇచ్చి వేస్తున్నామో లక్ష్మి వివరించింది. ఈ ఇంటిలో ఆమె కుమార్తె ఉంటున్నారు, కుమార్తెకు వివాహం అయి వెళ్లిపోతే ఇక తాను ఒక్కదాన్నే ఉంటాను.. నాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎందుకు అదేదో పేద కుటుంబానికి ఇవ్వండి అని తెలిపింది.. దీంతో అందరూ ఆమెని సన్మానించారు… ఎంతో పెద్దమనసుతో ఆలోచించిన లక్ష్మిని మంత్రి హరీశ్ రావు మనస్ఫూర్తిగా అభినందించారు. నిజంగా ఆమె చేసిన పనికి తెలంగాణ జనం అంతా ఆమెని అభినందిస్తున్నారు.