సీఎంకు గవర్నర్ కిరణ్ బేడీ కౌంటర్

సీఎంకు గవర్నర్ కిరణ్ బేడీ కౌంటర్

0
86

సీఎం గవర్నర్ మధ్య వివాదాలు విభేదాలు వస్తే అవి అంత తొందరగా సమిసిపోవు అంటారు.. కేంద్రం మధ్యలో మాట్లాడాల్సిందే.. అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.. తాజాగా పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణస్వామిల మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది.

పుదుచ్చేరి ఆదాయం పెంచుకునేందుకు కాసినోలు, మద్యం తయారీ సంస్థలు, లాటరీ కంపెనీలు స్థాపించాలని సీఎం నారాయణస్వామి భావిస్తుండగా, కిరణ్ బేడీ అందుకు అభ్యంతరం చెబుతున్నారు, ఆమె ఐపీఎస్ ఆఫీసర్ గా చేశారు తర్వాత గవర్నర్ అయ్యారు, ఇలాంటి వాటిని ఆమె ఏ నాడు ఎంకరేజ్ చేయలేదు, ఆదాయం కోసం ఈ పని వద్దు అని సీఎంకు తెలిపారు ఆమె.

కిరణ్ బేడీని నారాయణస్వామి దెయ్యం అని, మనస్సాక్షి లేని వ్యక్తి అని, జర్మనీ నియంత హిట్లర్ కు చెల్లెలు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కిరణ్ బేడీ ఘాటుగా స్పందించారు. సీఎం నారాయణస్వామి కాస్త హుందాగా, సభ్యతతో నడుచుకుంటే మంచిదని హితవు పలికారు. నేను లెఫ్టినెంట్ గవర్నర్ గా ప్రజల కోసం వారి క్షేమం కోసం చూస్తాను అని తెలిపారు ఆమె… ఎవరైనా ఒకరిని తిడితే ఆ వ్యక్తి ఆ తిట్టను స్వీకరించకపోతే అవి తిరిగి తిట్టిన వారికే చెందుతాయి అని విమర్శించారు ఆమె.