యాదాద్రిలో టీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. యాదాద్రి ఆలయం పున ప్రారంభం సందర్భంగా మహా కుంభ సంప్రోక్షణలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమయంలో అనుకోకుండా మంత్రిపై తేనెటీగలు దాడి చేశాయి. పూజారులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది పైన తేనెటీగలు దాడి చేశాయి. ప్రాథమిక చికిత్స కొరకుమంత్రి అజయ్ హైదరాబాద్ కు బయల్దేరివెళ్లారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.