బెంగాల్ కు కేంద్ర బృందం ఎందుకో తెలుసా…

బెంగాల్ కు కేంద్ర బృందం ఎందుకో తెలుసా...

0
95

కేంద్ర బృందాలు మరోసారి బెంగాల్ లో పర్యటించనున్నాయి… అయితే ఈ సారి కోవిడ్ పరిస్థితిపై అద్యాయనం చేయడానికి కాదు అంఫాన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించడానికి ఈబృందం వెళ్లనుంది.. వీరందర్ని రాష్ట్ర అతిథులుగా మమత సర్కార్ అభివర్ణించింది..

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ అంజశర్మ సారథ్యంలో ఏడుగురు అధికారులతో కేంద్ర హోంశాఖ ఓ బృందాన్ని నియమించింది… రోడ్లు భవణాలు, జలశక్తి విద్యుత్ శాఖ మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు… అంఫన్ తుఫాను కారణంగా బెంగాల్ ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే…

ఇప్పటికే ప్రధాని మోదీ బెంగాల్ లో పర్యటించారు.. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు… మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి 50 వేలు సాయాన్ని కూడా ప్రకటించారు.. బెగాల్ కు తక్షణ సహాయంగా వెయ్యి కోట్లను కూడా మోదీ ప్రకటించారు…