ఒరిపా ప్రాంతంలోని ఓ ఆరుగులు ఫ్రెండ్స్ రాత్రి ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళుతుంటే… ఈ సమయంలో పందెం వేసుకుందాం అన్నాడు జానీరాయ్, దగ్గర్లో దాబా దగ్గరకు వెళ్లి ఓ పది గుడ్లు తీసుకువచ్చారు.. అయితే నిమిషంలో ఈ పది గుడ్లు ఎవరు తింటే వారు పందెంలో గెలిచినట్లు అని…200 పందెం అన్నాడు, దీంతో జితేంద్ర సింగ్ ఒకే అన్నాడు.
అతను అప్పటికే నాలుగు బీర్లు తాగాడు.. ఇలా వరుసగా 8 గుడ్లు తిన్నాడు, అయితే సమయం అయిపోతోంది అని ఒకే సారి రెండు గుడ్లు లోపల పెట్టుకుని మింగాడు.. దీంతో గొంతుకి అవి అడ్డుపడ్డాయి.. ఊపిరి ఆడలేకపోయింది..వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. కాని ఆ సమయానికే శ్వాస తీసుకోవడం ఇబ్బంది వచ్చి అతను చనిపోయాడు.
ఈ విషాదంలో మిగిలిన స్నేహితులు ఈ సమయంలో ఆస్పత్రి దగ్గర ఉండకుండా మద్యం మత్తులో పక్కన రోడ్డు మీద పడుకున్నారు.. ఉదయం మద్యం మత్తు వదిలి చూస్తే మిత్రుడు చనిపోయాడు… వీరు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. ఇలాంటి బెట్టింగులు పనులు చేయవద్దు అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.