సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు కాస్త ఆదమరిస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది.. ఏదో ఓ కంపెనీ పేరు చెప్పి లింక్ పంపిస్తారు.. అది నిజంగా కంపెనీది అని ఓపెన్ చేస్తే మీ బ్యాంకు ఖాతా డీ టెయిల్స్ ఇస్తే ఇక మీ నగదు గోవింద.. ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు సైబర్ నిపుణులు పోలీసులు.
డీమార్ట్ 20వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా అందరికీ ఉచిత బహుమతులు.. అంటూ తాజాగా ఓ లింక్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఇదే లింక్ వైరల్ అవుతోంది.. కొంత మంది దీనిని ఓపెన్ చేసి పర్సనల్ డీటెయిల్స్ ఇస్తున్నారు, ఇలా డీ టెయిల్స్ ఇవ్వకండి అంతేకాదు వారు మీ బ్యాంకు ఖాతా నెంబర్ కూడా తీసుకుంటున్నారు.
ఇలా మీ పర్సనల్ బ్యాంకు డీ టెయిల్స్ ఇస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. దీనిపై తాజాగా డీ మార్ట్ కూడా ఓ ప్రకటన ఇచ్చింది, మేము ఎలాంటి వోచర్లు కూపర్లు ఇవ్వడం లేదు ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి అని తెలిపింది. సో మీరు మాత్రం ఇలా లింకులు ఓపెన్ చేసి మీ నగదుని పోగొట్టుకోకండి.