కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఆటగాళ్ల రెచ్చిపోయి ఆడుతున్నారు. దీంతో భారత్‌పై పతకాల వర్షం కురుస్తోంది. ఇవాళ మరో రెండు స్వర్ణ పతకాలను భారత్ చేజిక్కించుకుంది. బాక్సింగ్ క్రీడాంశంలో అమిత్ పంఘాల్, నీతూ ఘంఘాస్ తమ కేటగిరీల్లో ఫైనల్స్ నెగ్గి పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు.