చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ పుట్టింది… అక్కడ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈవైరస్ ఇప్పుడు దాదాపు 4.50 లక్షల మందికి సోకింది.. 21 వేల మరణాలు సంభవించాయి, అయితే ఇప్పుడు చైనా కోలుకుంటోంది. కాని ఇటలీ స్పెయిన్ అమెరికా ఈ అగ్రరాజ్యాలు మాత్రం దారుణమైన స్దితిలో ఉన్నాయి.
అయితే చైనా వైద్య అధికారులు మిగిలిన దేశాలకు ఈ వైరస్ గురించి దాని మందు గురించి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటున్నారు, ఇక చైనా ఈ వైరస్ తో బాధపడిన సమయంలో, భారత్ నుంచి
ప్రత్యేక విమానంలో వైద్య పరికరాలు, మందులను చైనాకు పంపించారు మన ప్రధాని.
అయితే దీనికి చైనా కూడా సంతోషించింది, తాజాగా చైనా కూడా ఇప్పుడు భారత్ కు సాయం అందిస్తోంది.
చైనాకు ఇండియా నుంచి 15 టన్నుల వైద్య పరికరాలు వెళ్లాయి. మాస్క్ లు, గ్లవ్స్, అత్యవసర ఔషధాలను ఇండియా పంపింది. తాజాగా అక్కడ నుంచి వైద్య పరికరాలు ఔషదాలు కూడా ఇండియాకి పంపనున్నారట. వైద్యులకి అవసరం అయ్యే కోట్లు ఇతర వైద్య పరికరాలు పంపనున్నారట.