భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ అరవై ఇస్తాము

భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ అరవై ఇస్తాము

0
104

భారత పర్యటనలో ఉన్న ట్రంప్ మన దేశ ప్రధాని నరేంద్రమోదీతో పలు వాణిజ్య డీల్స్ చేసుకున్నారు.. ఈపర్యటన ఎప్పటికీ మర్చిపోలేనిది అని తెలిపారు ట్రంప్.. నిన్న అంతా సందర్శనలు చేసిన ట్రంప్ నేడు ముఖ్యమైన భేటీలో పాల్గొన్నారు, పూర్తిగా నేడు ఒప్పందాలు చేసుకున్నారు.

అంతేకాదు మన దేశానికి గుడ్ న్యూస్ చెప్పారు, భారత్ కు అత్యంత అధునాతనమైన అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేయనున్నామని, ఇండియా– అమెరికా మధ్య సుమారు రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.

ఇక ఉదయం ట్రంప్ కుటుంబంతో సహ ఉన్నత అధికారులతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు, ఇది రెండు దేశాలకు మంచి పర్యటన అని తెలిపారు ఆయన, ఇక భారత్ కు సహజ వాయువు సరఫరా విషయంలో కూడా కీలక ఒప్పందాలు చేసుకున్నారు.