భారత్ లో అమెజాన్ అధినేత కీలక నిర్ణయం

భారత్ లో అమెజాన్ అధినేత కీలక నిర్ణయం

0
101
Amazon Layoffs

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అంటే తెలియని వారు ఉండరు, అంతలా ప్రజల్లోకి వెళ్లింది.. భారత్ తో పాటు ఇతర దేశాల్లో తన మార్కెట్ అంతకంతకు పెంచుకుంటూ పోయింది. అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్ లో రూ.7 వేల కోట్లు పెట్టుబడి పెడతామని బెజోస్ చెప్పారు. ఇది పరిశ్రమ వర్గాలకు మంచి జోష్ నింపే వార్త అని చెప్పాలి.

చాలా వరకూ భారత్ లో రిటైల్ మార్కెట్ అమెజాన్ తో కనెక్ట్ అవుతున్నారు.. దీని వల్ల మార్కెట్ లో వారి వాటా పెరుగుతోంది.. అమెజాన్ కు భారత్ నుంచి దాదాపు 40 శాతం ఆదాయం వస్తోంది.. అందుకే అమెజాన్ అతి పెద్ద సెంటర్లు కూడా భారత్ లో ఏర్పాటు చేస్తోంది.

దీనిపై కేంద్రం వ్యతిరేకదిశలో స్పందించింది… అమెజాన్ సొంత లాభం కోసం పనిచేస్తుందని, వేల కోట్లు పెట్టుబడులు పెట్టినంత మాత్రాన భారత్ కు మేలు చేస్తున్నట్టు కాదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు… మంత్రి వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన అమెజాన్ యాజమాన్యం వచ్చే ఐదేళ్లలో భారత్ లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటన చేసింది. దీని వల్ల భారత్ లో యువతకు ఉద్యోగాలు భారీగా వస్తాయి అని చెప్పారు