ప్రణబ్ కు భారతరత్న..సోనియా,రాహుల్ గైర్హాజరుకు కారణం అదేనా?

ప్రణబ్ కు భారతరత్న..సోనియా,రాహుల్ గైర్హాజరుకు కారణం అదేనా?

0
83

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం(ఆగస్టు-8,2019) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సహా బీజేపీకి చెందిన పలువురు నాయకులు కూడా రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్‌ నాయకులు ఆనంద్‌ శర్మ, అహ్మద్‌ పటేల్‌, భూపేందర్‌ సింగ్‌ హుడా, జనార్ధన్‌ ద్వివేది, ఆర్పీఎన్‌ సింగ్‌, సుష్మిత దేవ్‌, శశిథరూర్‌ హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరు కాలేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్‌ నుంచి రాహుల్‌కు ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన రాలేదు. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. గతేడాది నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా వెళ్లిన విషయం తెలిసిందే.

అయితే ఆర్ఎస్ఎస్ ను ఓ మతతత్వ సంస్థ కాంగ్రెస్ సంబోధిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ లో కొనసాగి ఆర్ఎస్ఎస్ విషయంలో ప్రణబ్ అనుసరించిన వైఖరిపై సోనియా,రాహుల్ అసహనంగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే వారు ప్రణబ్ భారత్ రత్న అందుకున్న కార్యక్రమానికి రాలేదని తెలుస్తోంది.