భారత్ లో ఈ 10 కండిషన్లు ఫాలో అవుతాం ? థియేటర్లకు పర్మిషన్ ఇవ్వండి

భారత్ లో ఈ 10 కండిషన్లు ఫాలో అవుతాం ? థియేటర్లకు పర్మిషన్ ఇవ్వండి

0
92

లాక్ డౌన్ కారణంతో మన దేశంలో ఎక్కడా కూడా సినిమా థియేటర్ ఓపెన్ కావడం లేదు దాదాపు మార్చి 20 నుంచి సినిమా ప్రదర్శనలు లేవు, ఇక షూటింగులు బంద్ అయ్యాయి, దీంతో నెలకి 1000 కోట్ల రూపాయల సినిమా వ్యాపారం ఆగిపోయింది, లక్షలాది మంది ఈ పరిశ్రమపై ఆధారపడిన వారికి ఇబ్బంది కలుగుతోంది.

ఆగస్టు నెలాఖరులోగా థియేటర్లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు, కాని కేసులు చూస్తుంటే మళ్లీ డౌట్ వస్తోంది. కొందరు థియేటర్ యజమానులు సినిమా థియేటర్లకు పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నారు, పలు రూల్స్ ఫాలో అవుతాము అని వారికి వారే చెబుతున్నారు. అవి ఏమిటో చూద్దాం.

1.. ప్రతీ సినిమా ప్రేక్షకుడు మాస్క్ ధరించాలి
2. ఎంట్రన్స్ లో వారికి శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తాం
3.పేపర్ టికెటింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, డిజిటల్ టికెట్లను జారీ చేస్తాం.
4.బార్ కోడింగ్ ఎస్ ఎమ్ ఎస్ విధానం పెడతాం
5. థియేటర్ దగ్గర భారీగా టికెట్స్ అమ్మము
6..ప్రతి సీటు మధ్య ఖాళీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం
7..మల్టీప్లెక్స్ లలో ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభం కాకుండా టైమ్స్ మారుస్తాం
8. ఒకేసారి థియేటర్లకు ఇంటర్వెల్ రాకుండా అరగంట లేట్ గా దీనికి ముందు షోకి గ్యాప్ ఇస్తాం
9.ప్రతి ప్రదర్శనకూ మధ్య అరగంట సమయం ఉండేలా చూసి హాలు శానిటైజ్ చేస్తాం
10. కుర్చీ కుర్చీకి మధ్య గ్యాప్ ఉంచి భౌతిక దూరం పాటిస్తాం
11. ఎక్కువ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు

మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.