‘భూతగాదాలే ఎమ్మెల్యేల ఆదాయ మార్గాలు..అలా చేస్తేనే రైతులకు న్యాయం’

0
78
naragoni praveen kumar

రెవెన్యూ సదస్సుల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం అంటే దొంగలకు తాళం చెవి ఇచ్చినట్లే అని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగొని ప్రవీణ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సదస్సులు పెడితే సమస్యలు తీరవు. సమస్యలు తీర్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఇవ్వాలి.

రెవెన్యూ చట్ట సవరణ చేయాలి. ధరణి పోర్టల్ లో ఆప్షన్స్ తేవాలి. సమస్యలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ ను మార్చాలి. సదస్సులు పెట్టి ఫిర్యాదులు స్వీకరిస్తే సమస్యలు పరిష్కారం అయ్యేది ఉంటే, ఇప్పటికే లక్షల కొలది ఫిర్యాదులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటే అమాయకులకు పేదలు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది.

ఇరువురి మధ్య ఉన్న భూమి తగాదాలను ఆదాయ మార్గాలుగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంచుకుంటారు. న్యాయ నిపుణులతో, రెవెన్యూ అధికారులతో గ్రామ సభలు నిర్ణయించి..అక్కడికక్కడే భూ సమస్యలు పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని నారగొని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.