ఏపీ విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయిన క్రమంలో సప్లిమెంటరీ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీవరకు గడువు ఉందని తెలుపగా..ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.