ఐపీఎల్‌ ప్రసార హక్కుల కోసం బడా కంపెనీలు పోటీ

0
112

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ వార్త అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది.

ఐపీఎల్ మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకున్నా..మార్చి 27 నుంచే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 28న ఫైనల్స్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

అదేవిధంగా ఐపీఎల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకోవడానికి బడా కంపెనీ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్​ ఫ్రాంచైజీ కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు తీవ్ర పోటీనిస్తున్న అమెజాన్‌ కూడా ఐపీఎల్ టెలికాస్ట్‌ రైట్స్‌ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.