తెలంగాణ పోలీసులకు రాష్ర సర్కార్ షాకిచ్చింది. మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న కాలంలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్ లు ఇస్తుంది. ఈ అలవెన్స్‌ను గత నెల వరకు ఇస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ అలవెన్సులపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ నిర్ణయం కొన్ని జిల్లాల్లోనే అమలులోకి రానుంది. ఆ జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల గురించి కేంద్ర హోంశాఖ తాజాగా వెలువరించిన జాబితా ఆధారంగా కోత విధించినట్లు సమాచారం. ఇక ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం అలవెన్స్ ఇస్తూ మిగిలిన జిల్లాలకు కోత విధించారు. ఇక కేసీఆర్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పై కొంత మంది పోలీసులు నిరసన తెలుపుతున్నారు. తెలంగాణలో నక్సల్స్ లేరని పోలీసులకు ఇచ్చే 15 శాతం స్పెషల్ అలవెన్స్ తొలగించారు. బాగుంది.. కానీ, లేని నక్సల్స్ నుంచి రక్షణ కోసం రాజకీయ నాయకులకు, అధికారులకు ఎస్కార్ట్, గన్‌మెన్లు ఎందుకు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.