బిగ్ షాక్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు..ఎప్పుడంటే?

0
95

సాధారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ముడి చమురు ధరలు పెరిగితే.. ఇండియాలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచుతాయి. ఇప్పటికే విపరీతంగా పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యుడు రోడ్డెక్కడానికే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నడ్డి విరిచే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.

నవంబర్‌ 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు మాటే లేదు.  సాధారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌ కు ఒక డాలర్‌ పెరిగితే.. ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు లీటర్‌ కు 45 పైసలు పెరగాలి.

నవంబర్‌ 4 నుంచి పెరిగిన బ్యారెల్ ధరలను లెక్కవేస్తే.. ఇండియాలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 6 రూపాయలకు పైగా పెరగాలి. దీనికి వ్యాట్‌ లాంటి పన్నులను కలిపితే.. అది 8 రూపాయకు చేరుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆ నష్టాన్ని భరిస్తూ.. వచ్చిన కేంద్రం.. అవి ముగిసిన వెంటనే ఆ 8 రూపాయల భారం సామాన్యుడిపై వేసేందుకు సిద్దం అవుతోంది.