Flash: ఏపీ సర్కార్ కు బిగ్ షాక్..కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం బ్రేక్

Big shock to AP government..Central break for formation of new districts

0
107

ఏపీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. కేంద్ర జనగణన శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. జనగణన సందర్భంగా జూన్ మాసం వరకు జిల్లాల సరిహద్దులో మార్చవద్దని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల కింద 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు  జన గణన డిప్యూటీ డైరెక్టర్ లేఖ రాశారు.