బాలయ్య చిన్న అల్లుడు కుటుంబానికి బిగ్ షాక్

బాలయ్య చిన్న అల్లుడు కుటుంబానికి బిగ్ షాక్

0
91

బాలయ్య బాబు చిన్న అల్లుడు శ్రీభరత్ అందరికి తెలిసిన వ్యక్తే …నందమూరి వారి ఇంటి అల్లుడు అలాగే ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. దీంతో టీడీపీలో క్రియాశీలకంగా ఉండటంతో ఆయన పేరు బాగా వినిపించింది.. ఇటు వ్యాపారాలు చేసుకుంటూనే అటు రాజకీయంగా టీడీపీలో కొనసాగుతున్నారు.. విశాఖలో టీడీపీకి కష్టపడి పనిచేస్తున్నారు..

తాజాగా వారు కంపెనీ తరపున తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, ఆయన కుటుంబీకులకు బ్యాంకు నోటీసులు వెళ్లాయి. హైదరాబాద్ లోని అబీడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి, టెక్నో యునీక్ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొన్ని నెలల క్రితం రుణం తీసుకున్నారట.

అయితే దీనిపై చెల్లింపులు జరపడం లేదని నోటీసులకి రిప్లై లేదు అని బ్యాంకు అధికారులు చెబుతున్నారు..దీంతో వారికి నోటీసులు పంపించామని చెబుతున్నారు, దీనిపై సరైన స్పందన లేకపోతే కోర్టు అనుమతితో ఆస్తులు వేలం వేస్తామని అంటున్నారు.ఈ నోటీసులు శ్రీ భరత్ తో పాటు ఆయన తండ్రి పట్టాభి రామారావు, ఆయన సోదరుడు లక్ష్మణరావు తదితరుల పేరిట జారీ అయినట్టు తెలుస్తోంది. దాదాపు బ్యాంకుకు అప్పు 120 కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి.