బీజేపీకి బిగ్ షాక్..ఉత్తరాఖండ్ సీఎం ఓటమి

0
84

5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ విజయం సాధించింది. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్ర సిట్టింగ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు. ఈ పరిణామం బీజేపీకి షాక్ తగిలేలా చేసింది. ఖతిమా నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు.