ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే… ఇక పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రెబల్ గా మారారు..
అయితే చంద్రబాబు నాయుడు ఈ షాక్ నుంచి కోలుకోక ముందే ఆయనకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు… ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు… రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు…
జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగుళూరు పర్యటనలో ఉన్నారు… ఆయన తిరిగి ఏపీకి వచ్చిన తర్వాత రేపు వైసీపీ కండువా కప్పుకోనున్నారు పంచకర్ల రమేష్ బాబు.. కాగా ఆయన 2009, 2014లో యలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే…