చంద్రబాబుకు బిగ్ షాక్… పులివెందులలో టీడీపీ బిగ్ వికెట్ డౌన్…

చంద్రబాబుకు బిగ్ షాక్... పులివెందులలో టీడీపీ బిగ్ వికెట్ డౌన్...

0
101

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతిలో పులివెందుల నియోజకవర్గంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఓటమి పాలు అయిన సతీష్ కుమార్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో చాలా మంది తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు…. ఇదే కడప జిల్లాకు చెందిన మాజీ టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అలాగే సీఎం రమేష్ వంటి వారు బీజేపీలోకి జంప్ చేశారు.. రేపో మాపో రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలోకి జంప్ చేస్తారని వార్తలు వస్తున్నాయి… ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిల్లో సతీష్ రెడ్డి కూడా సైకిల్ దిగాలని చూస్తున్నారట…

రాజకీయంగా ముందుకు సాగాలంటే సైకిల్ ను దిగితే బాగుంటుందని భావిస్తున్నారట… పులివెందులలోని సతీష్ కు చెందిన ఒక వర్గం వైసీపీలో చేరితే బాగుంటుందని అంటున్నారు… మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి…