ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి… వచ్చే వారంగో గోదావరి జిల్లాకు చెందిన కీలక నేత వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇప్పటికే చాలామంది కీలక నేతలు వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే…
ఇక ఇదే క్రమంలో మరో వారంలో మరో కీలక నేత వైసీపీలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి… టీడీపీ నేత చలమ శెట్టి సునీల్ వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… కాకినాడ లోక్ సభ స్థానానికి వివిధ పార్టీల తరపున పోటీ చేసినా కూడా ఆయన ఒక్కసారి కూడా గెలవలేకపోయారు…
రాజకీయ సమీకరణాలను సరిగ్గా అంచనా వేయలేక ఆయన పోటీ చేసిన ప్రతీ సారి ఓటమి పాలు అయ్యారు… 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, 2019లోటీడీపీ తరపున కాకినాడ బరిలో దిగినా కూడా ఆయన గెలవలేకపోయారు… ఇప్పుడు మరోసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని చూస్తున్నారట ఆయన… దీనికి సీఎం జగన్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి… అన్నీ కుదిరితే వచ్చే వారంలో సునీల్ వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి…
—
Regards,
N.Ramesh Babu