Flash News : టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఝలక్

0
91

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు జైలు శిక్ష విధించింది ప్రజా ప్రతినిధుల కోర్టు. దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష తో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం.

బంజారాహిల్స్ లో 2013లో నమోదైన కేసులో దానం నాగేందర్ ను దోషిగా తేల్చింది కోర్టు. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారన్న కేసులో దానం నాగేందర్ పై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. దానం నాగేందర్ అప్పీలు వెళ్ళేందుకు శిక్షను నెల రోజులు నిలిపి వేసింది కోర్టు.

దానం నాగేందర్ తో పాటు మరొకరిపై నేరం రుజువు కావడంతో శిక్ష విధించింది ప్రజాప్రతినిధుల కోర్ట్. ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ ఆరు నెలలు జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. అయితే దానం నాగేందర్ పై మరొక కేసు లో విచారణ కొనసాగుతున్నది.

ఇదిలా ఉండగా  2013లో అప్పటి టిఆర్ఎస్ నేత తెలంగాణ జాగృతి సంస్థలో పనిచేసే తిరుపతి వర్మ అనే న్యాయవాదిని దానం నాగేందర్, ఆయన మనుషులు దాడిచేసి కొట్టారు. ప్రస్తుతం ఆ కేసులో విచారణ కొనసాగుతున్నది.