తెలంగాణ: సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి రాజీనామీ వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వెంకట్ రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్ సింగ్, జే.శంకర్ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు.
కాగా..ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటీషర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు. అలాగే వరి విత్తనాల అమ్మకుడదంటూ వెంకట్ రామి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన క్రిమినల్ కంట్మెంట్‌లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంకట్రామిరెడ్డితో బేషరత్‌గా క్షేమపణల స్టేట్మెంట్ నమోదు చేసి హైకోర్టుకు సమర్పిస్తామని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది.
వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామంటూ విత్తన డీలర్లను హెచ్చరించిన అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విత్తనాలు విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని..ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సిఫార్సులు చేయించినా వదిలేది లేదని ఆయన హెచ్చరికలు చేశారు. అంతటితో ఆగని ఆయన వరి విత్తనాలు విక్రయిస్తూ దొరికితే సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా షాపులు తెరవనివ్వబోమని ఆయన కరాఖండిగా చెప్పారు. విత్తనాలు విక్రయించొద్దని చెప్పడమేంటని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కోర్టు ఆర్డర్ పట్టించుకోనంటున్నారని..కలెక్టర్ ఏమైనా సుప్రీం కోర్టు కంటే సుప్రీమా అంటూ ఘాటు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కలెక్టర్‌గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు రావడంతో న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.