మ‌ళ్లీ జేసీ కుటుంబానికి బిగ్ షాక్

మ‌ళ్లీ జేసీ కుటుంబానికి బిగ్ షాక్

0
99

ఈ మ‌ధ్య జేసీ సోద‌రుల వార్త‌లు బాగా వినిపిస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తిరుగులేదు అనుకున్న జేసి కుటుంబం ఇప్పుడు వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కారు పాల‌న‌లో మాత్రం ఇబ్బందులు పడుతోంది అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.

తాజాగా జేసీ కుటుంబానికి సంబంధించి బ‌స్సుల వ్యాపారం సిమెంట్ వ్యాపారం గ‌నుల లీజు ఇవ‌న్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి, స‌రైన అనుమ‌తులు లేకుండా అక్ర‌మ వ్యాపారాలు చేస్తున్నారు అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా జేసీ బ్ర‌ద‌ర్స్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు…జేసీ సోదరులు కుటుంబంలోని మహిళలను అడ్డంపెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమాదేవి పేరు మీద 84 బస్సులు ఉన్నాయని, వాటికి సంబంధించిన పత్రాలన్నీ నకిలీవేనని ఆరోపించారు. ఇలా అక్రమ వ్యాపారం న‌డుపుతున్నారు అని విమ‌ర్శించారు.

జేసీ దివాకర్ రెడ్డి సోదరుల రవాణా వ్యాపారమంతా ఫోర్జరీ సర్టిఫికెట్లతోనే నడుస్తోందని అన్నారు. వారి వ్యాపారాల‌కు అడ్డుక‌ట్ట వేస్తామ‌ని ఇంకా వీరి బాగోతం బ‌య‌ట‌పెడ‌తామ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.