పవన్ కు షాక్ జనసేనలో మరో బిగ్ వికెట్ డౌన్

పవన్ కు షాక్ జనసేనలో మరో బిగ్ వికెట్ డౌన్

0
95

2024 ఎన్నికల్లో ఈ సారి ఏపీలో తమపట్టు సాధించాలని జనసేన పార్టీ అధినేత నటుడు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న తరుణంలో ఆ పార్టీ మహిళా నాయకురాలు గట్టి షాక్ ఇచ్చారు… గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చెందిన పుట్టి లక్ష్మీ సామ్రాజ్యం తాజాగా జనసేన పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు…

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షములో ఆమె బీజేపీ తీర్ధం తీసుకున్నారు…. ఆమెతో పాటు సుమారు 100 మంది జన సైనికులు కూడా బీజేపీ తీర్ధం తీసుకున్నారు… ఆ తరువాత ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు…

జనసేన పార్టీలో నిజాయితీగా పనిచేసేవారికి స్థానం లేదని లక్ష్మీ సామ్రాజ్యం ఆరోపించారు… ఏపీలో ఆ పార్టీ పుంజుకోటం కష్టం అని అన్నారు… దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ చేస్తున్న అబివృద్దిని చూసి బీజేపీలో చేరానని అన్నారు లక్ష్మీ సామ్రాజ్యం.