పవన్ కు బిగ్ షాక్ జనసేనకు కీలకనేత గుడ్ బై

పవన్ కు బిగ్ షాక్ జనసేనకు కీలకనేత గుడ్ బై

0
100

2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షణ పేరుతో ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి చెందిన వారిని బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. ఇక రానున్న మరికొద్దిరోజుల్లో ఈ వలసలు ఎక్కువ అవుతాయని అంటున్నారు. అయితే ఇదే ఆకర్షణలో భాగంగా జనసేన పార్టీ గిరిజన నేత రాజారావు తన అనుచరులతో కలిసి తాజాగా బీజేపీలో చేరారు..

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా సమక్షంలో ఆయన కమలం తీర్ధం తీసుకున్నారు… ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా ఉన్నారు.. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ… ప్రధాని మోదీ దేశ అభివ్రుద్దిని చూసి తాను బీజేపీలో చేరానని అన్నారు.