టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి మరో బిగ్ షాక్….

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి మరో బిగ్ షాక్....

0
97

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆయనకు సంబంధించిన ఆస్తులను వేలం వేయాలని తాజాగా ఆంధ్రా బ్యాంకు నిర్ణయించింది… ఈ మేరకు నోటీసులను కూడా విడుదల చేసింది….

రానున్న మార్చి 23న రాయపాటి ఆస్తులు వేలం వేస్తున్నట్లు ప్రకటించారు… అతనికి చెందిన ఆరండల్ పేటలోని కమర్షల్ కాంప్లేక్స్ తోపాటు న్యూఢిల్లీలోని ద్వారకాలోని ప్లాట్ కూడా వేలం వేయనున్నట్లు ఆంధ్రా బ్యాంకు నోటీసుల్లో పేర్కొంది…..

గతంలో సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీల 300 కోట్ల మేర బ్యాంకు రుణాలు తీసుకుంది అయితే వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో ఇటీవలే సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు… పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు…