Breaking: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..రాజీనామా చేసిన యువలీడర్‌

0
84
Telangana Congress Party

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. అకస్మాత్తుగా గుజరాత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్న హార్దిక్‌ పటేల్‌ రాజీనామా చేసినట్టు ఆయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో వెల్లడించడం జరిగింది. ఈ రాజీనామాకు గుజ‌రాత్ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట కారణమని కాంగ్రెస్ సభ్యులు చెప్పుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా..తన భవిష్యత్తు కార్యచరణపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.