టీఆర్ఎస్ కు బిగ్ షాక్..కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే

0
111

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడనున్నారు. దీనితో తెరాసకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.

ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. రేపు ఉదయం (శనివారం) 10 గంటలకు సొంత నియోజకవర్గానికి రానున్నారు.

కారణం ఇదే?

”ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస పార్టీ పరిస్థితి బాగొలేదు. అశ్వరావుపేట తెరాస ఇన్‌ఛార్జ్‌గా కేటీఆర్ నన్ను ప్రకటించినప్పటికీ.. ఎవరూ నన్ను గుర్తించట్లేదు. రాజకీయంగా నన్ను అణగదొక్కే శక్తులు తెరాసలోనే ఉన్నాయి. నా కుమార్తె చనిపోతే కూడా.. పార్టీలో నేతలు పరామర్శించలేదు. తెరాస అధిష్ఠానం ఇకనైనా గుర్తించి నాకు పార్టీలో గుర్తింపు ఇవ్వాలి. వచ్చే ఎన్నికల్లో అశ్వరావుపేట నుంచే బరిలోకి దిగుతా.. నాలాగే మరెంతో మందికి తెరాస పార్టీలో అవమానం జరుగుతోంది. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.