దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరిగింది, రోజుకి ఆరువేల కేసులు వస్తున్నాయి, మరీ ముఖ్యంగా ముంబైలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది, లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసులు తగ్గడం లేదు, దాదాపు లక్షన్నర కేసులు చేరాయి, అయితే ఐదో విడత లాక్ డౌన్ పై కేంద్రం కసరత్తులు చేస్తోంది, ఇప్పటికే కేసులు తక్కువ ఉన్న ప్రాంతాల్లో అన్నీ దుకాణాలు తెరచుకున్నాయి వ్యాపారాలు జరుగుతున్నాయి.
రెడ్ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో మూడు రోజులు మాత్రమే మే 31 కి సమయం ఉంది, లాక్ డౌన్ అప్పటితో ముగుస్తుంది, ఈ సమయంలో ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో లాక్ డౌన్ గురించి ప్రస్తావిస్తారని తెలుస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 11 నగరాలపైనే ఫోకస్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది.
ఈ 11 నగరాల్లో దాదాపు 70 శాతం కేసులు నమోదు అవుతున్నాయి, అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూర్, పుణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్కతా నగరాల్లో కరోనా కట్టడిపై మరింత ఫోకస్ పెట్టాలని ఆయా నగరాల అధికారులకు అక్కడ ప్రభుత్వాలకు తెలియచేస్తున్నారు అధికారులు..
ఇప్పటికే 30 మున్సిపల్ కార్పొరేషన్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక్కడ పక్కాగా లాక్ డౌన్ అమలు ఉంటుంది అని తెలుస్తోంది.