వైసీపీ సర్కార్ పలు సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతోంది, పేదలకు జగన్ సర్కారు నెల నెల తీపి కబురు అందిస్తూ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.. కొత్తవి ప్రకటిస్తోంది, అయితే ఇసుక మాత్రం చాలా మందికి ఇబ్బందిగా మారింది.
అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక పాలసీని రూపొందించే విషయంలో ఆచితూచి వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం… తాజాగా తాము రూపొందించిన ఇసుక పాలసీలో పలు మార్పులు చేసింది.
ఇసుక రీచ్‌ల నుంచి గృహ అవసరాలకు ట్రాక్టర్లు ద్వారా ఉచితంగా పొందేలా అవకాశం కల్పించింది.
ఇలా తీసుకువెళ్లాలి అంటే సదరు ఇంటి వారు కచ్చితంగా గ్రామ, వార్డు సచివాలయల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రశీదు సర్టిఫికెట్ ప్రకారం వారికి ఇలా ఉచిత ఇసుక ఇస్తారు.
ప్రభుత్వ గృహ నిర్మాణాలు, పునరావాస నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందించనున్నారు. వీరు కచ్చితంగా జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాలి.