బిగ్ బ్రేకింగ్ కరోనా చికిత్సకు ఔషధం రెడీ ధర కూడా తక్కువే

బిగ్ బ్రేకింగ్ కరోనా చికిత్సకు ఔషధం రెడీ ధర కూడా తక్కువే

0
94

ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, దీనికి ఎప్పుడు వాక్సిన్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, మరీ ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. తాజాగా కరోనా వైరస్ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది.

ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్మార్క్ ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పని చేసింది అని తెలిపింది.

ఇక దీనికి . ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట మార్కెట్లో విడుదల చేస్తాము అని తెలిపింది, ఇప్పటికే దీనిపై భారత వైద్య మండలి నుంచి అన్నీ అనుమతులు తీసుకున్నారు..కచ్చితంగా ఇది వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే అమ్ముతారు. ఒక్కో టాబ్లెట్ ధర రూ.103గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.