దేశంలో కరోనా వైరస్ విజృంబిస్తోంది… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాకూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది… తాజాగా కరోనాతో ఒక ఎమ్మెల్యే మృతి చెందారు… డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ కరోనాతో మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు..
గత వారం ఆయన కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు… దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు… పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది.. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు…
అన్బళగన్ మృతితో డీఎంకేలో తీవ్ర విశాదం నింపుతోంది… డాఎంకే తరపున ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు… కరోనా టైమ్ లో నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేశారు.. కాగా మరో వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంబిస్తోంది…
—