బండిలో పెట్రోల్ డీజీల్ లేకపోతే ముందుకు నడవదు, అసలు దేశం ముందుకు నడవదు అనే చెప్పాలి, కోట్లాది వాహనాలకు కచ్చితంగా ఈ ఫ్యూయల్ కావాల్సిందే, అయితే లాక్ డౌన్ వేళ చాలా వరకూ బళ్లు ఇంటికి పరిమితం అయ్యాయి, ఎమర్జెన్సీ వెహికల్స్ మాత్రమే రోడ్లపైకి వస్తున్నాయి, అయితే దేశంలో తాజాగా పెట్రోల్ అమ్మకాలు కూడా సగానికి పడిపోయాయి.
మన దేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ఆలిండియా పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మీ బండిలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాలంటే ఇక నుంచి తప్పనిసరి మాస్క్ దరించాల్సిందే. గతంలో హోల్మెట్ ఉంటేనే పెట్రోల్ బైక్స్ కి కొట్టేవారు అలాగే ఇప్పుడు బైకర్ కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే అని రూల్ తెచ్చారు.
మాస్క్ లేకుండా బంక్‌లోకి వస్తే పెట్రోల్ లేదా డీజిల్ పోయకుండా పంపించివేస్తారు. కరోనా నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నో మాస్క్ నో ఫ్యూయల్ అనే కాప్షన్ ఇప్పటికే స్టార్ట్ అయింది, సో కచ్చితంగా బైక్ పై వెళితే మాస్క్ ఉండాల్సిందే.