బిగ్ బ్రేకింగ్ …పవన్ పాదయాత్ర ఎప్పటినుంచంటే

బిగ్ బ్రేకింగ్ ...పవన్ పాదయాత్ర ఎప్పటినుంచంటే

0
103

పవన్ కల్యాణ్ రాజకీయంగా దూసుకుపోతున్నాడు.. అయితే ఏపీలో ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలవ్వడంతో ఆయనకు రాజకీయంగా కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పార్టీ తరపున కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచారు.. అది కూడారాజోలు.. అయితే చాలా వరకూ రాజకీయ పార్టీల అధినేతలు పాదయాత్రలు చేసి సీఎం లు అయ్యారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్మోహనరెడ్డి అందరూ.. పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చారు అందుకే ఇప్పుడు పవన్ కూడా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారట, అయితే ఎన్నికల ముందు పాదయాత్ర చేయని పవన్, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనే చర్చ
అందరి మదిలో ఉంది.

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. స్వయంగా తాను చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు… ఇప్పుడు రైతుల కన్నీరు తుడిచేందుకు పాదయాత్రల అవసరమని పవన్ కల్యాణ్ అన్నారు అయితే వచ్చే రోజుల్లో పవన్ పాదయాత్ర పక్కా అనే అంటున్నారు అభిమానులు