లాక్ డౌన్ విషయంలో కేంద్రం సడలింపులు ఇచ్చింది, అయితే కొన్ని రాష్ట్రాలు బాగానే అమలు చేస్తున్నా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వీటిని సరిగ్గా పాటించడం లేదు, దీంతో దేశంలో కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది, అందుకే కేంద్రం కూడా సీరియస్ అయింది, ఆయా రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరగడానికి ఇది కారణం అంటున్నారు.
అందుకే అన్నీ రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది… లాక్‌డౌన్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది..
ఈ విషయమై అన్ని రాష్ట్రాలకు హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. కంటైన్మెంట్ జోన్లలో మార్గదర్శకాలను ఎక్కువగా ఉల్లంఘించినట్లు తమకు సమాచారం వచ్చిందని లేఖలో ప్రస్తావించారు. ఇక రాత్రి సమయంలో ఎలాంటి కర్ ఫ్యూ కూడా కొన్ని స్టేట్స్ పాటించడం లేదు, ప్రయాణాలు చేస్తున్నారు.. వీటిని ఆపాలి అని తెలిపారు, ఇప్పటికే సీఎస్ లకు లెఫ్ట్ నెంట్ గవర్నర్లకు ఈ విషయం పై లేఖలు రాసింది కేంద్రం.