దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది… మార్చి చివరి నుంచి మొదలైన ఈ లాక్ డౌన్ ఇప్పుడు మే 31 వరకూ కొనసాగనున్న విషయం తెలిసిందే.. అయితే కేంద్రం ప్రజా రవాణాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అంతేకాదు విమానాలు రైళ్లు బస్సుల రాకపోకలపై ప్రయాణాలపై కొన్ని సడలింపులతో కొన్ని సర్వీసులు నడుపుతోంది.
ఇక ఈ సమయంలో కొన్ని పరిశ్రమలు కంపెనీలు ప్లాంట్లు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి కంపెనీలు నెమ్మదిగా తెరచుకుంటున్నాయి, ఈ సమయంలో చిత్ర పరిశ్రమ ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ రంగం గురించి చర్చ జరుగుతోంది,,, ఎప్పుడు థియేటర్లు తెరచుకుంటాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ సమయంలో కీలక న్యూస్ వచ్చింది.
దేశవ్యాప్తంగా ఆగిపోయిన సినిమా షూటింగ్లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. టాలీవుడ్ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కిషన్ రెడ్డి మాట్లాడారు. జమ్ము కశ్మీర్తో సహా దేశంలోని అన్ని ప్రాంతాలల్లో షూటింగ్లు చేసుకునేందుకు త్వరలోనే అనుమతులిస్తామన్నారు. థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో ఇది ఒకే ప్రాంతంలో కాదని దేశం అంతా ఒకేసారి తెరచుకునేలా నిర్ణయం తీసుకుంటాము అని అన్నారు.