బిగ్ షాక్ ఇచ్చిన ముద్రగడ…

బిగ్ షాక్ ఇచ్చిన ముద్రగడ...

0
116

కాపు ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరుతూ తాజాగా 13 జిల్లాలకు చెందిన కాపు నేతలు ముద్రగడ పద్మనాభంను కలిశారు… ఈసందర్భంగా వారు తిరిగి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించాలని కోరారు…

అయితే దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు… తాను కాపు ఉద్యమానికి నాయకత్వం వహించలేనని అన్నారు… ఆ తర్వాత ఆయన ఒక లేఖ విడుదల చేశారు… గౌరవపెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వచ్చి నమస్కారములు చేయుచున్నాను…

మీ కోరికను గౌరవించలేకపోతున్నానని అన్నారు… అందుకు తనను క్షమించాలని కోరారు… మీ అందరి ప్రేమ మరువలేనని మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా నాకు తెలియజేస్తే ఓపిక ఉన్నంత వరకు వస్తానని తెలిపారు… దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని కోరారు..