పవన్ లాంగ్ మార్చ్ కు బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

పవన్ లాంగ్ మార్చ్ కు బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.

0
72

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చింది వైసీపీ సర్కార్… విశాఖ జిల్లాలో ఆయన చేపట్టబోయే లాంగ్ మార్చ్ కు అనుమతిని నిరాకరించారు పోలీస్ అధికారులు… అలాగే విశాఖ జిల్లోలో లాంగ్ మార్చ్ కోసం జరిగే ఏర్పాట్లను అడ్డుకున్నారు…

కాగా ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకకు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో పవన్ వారికి అండగా నిలబడ్డారు… ఈనెల మూడున అంటే రేపు మద్యాహ్నం మూడు గంటలకు మద్దలె పాలేం తెలుగు తల్లి విగ్రహం దగ్గర ప్రారంభం అయ్యే ఈ లాంగ్ మార్చ్ జీవీఎంసీ కార్యాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వరకు మొత్తం 2.5 కిలో మీటర్లు సాగనుంది…

ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఉభయ గోదావరి భవన నిర్మాణ కార్మికులు అలాగే విశాఖ కృష్ణా గుంటూరు కార్మికులు పెద్దఎత్తున హాజరు కానున్నారు..