బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు తెలిస్తే మతిపోతాయి

బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు తెలిస్తే మతిపోతాయి

0
86

ఎమ్మెల్యేలు మంత్రులకే కోట్ల రూపాయల ఆస్తులు ఉంటున్నాయి.. ఇక కేంద్రమంత్రులకి సీఎంలకి ఆస్తులు వందల కోట్ల రూపాయలు ఉంటాయి అని అనుకుంటారు చాలా మంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ బీహర్ చాలా వైవిధ్యమైన ప్రాంతం.. అక్కడ ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో తెలియదు.. చిన్న అవినీతి ఆరోపణ వచ్చినా ఇక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కనుమరుగు అవుతుంది.

ఇక ఇక్కడ బీహార్ సీఎం గా నితీశ్ కుమార్ ఉన్నారు, రాజకీయంగా మంచి పేరు ఉన్న వ్యక్తి అక్రమాలకు అవినీతికి దూరంగా ఉంటారు, తాజాగా ఆయన ఆస్తుల గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. తన వార్షిక ఆస్తుల వెల్లడిలో గత ఏడాది (2018)తో పోలిస్తే.. కేవలం రెండు ఆవులు మాత్రమే పెరిగాయని ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా దీనిపై చాలా మంది చర్చించుకుంటున్నారు.

2010 నుంచి నితీశ్, తన మంత్రివర్గ సహచరులు ఏటా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని నిబంధన విధించారు. ఈ మేరకు ప్రతీ ఏడాది జనవరి మొదటి వారం లేదా ఏడాది చివరి రోజు నితీశ్ అతని సహచరులు తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు, దీంతో నిన్న ప్రకటించారు ఆయన ఆస్తులు.. గత ఏడాది తనకు పశువుల పాక ఉంది అని చెప్పారు అందులో ఎనిమిది ఆవులు, ఆరు ఆవు దూడలు ఉన్నాయన్నారు.. ఇప్పుడు అవి పది ఆవులు, ఏడు ఆవు దూడలుగా అయ్యాయి అని చూపించారు.

2018లో తనదగ్గర రూ.42వేల నగదు ఉన్నట్లు చూపిన నితీశ్ తన దగ్గర ఉన్న నగదును రూ.38,039 గా ఈ ఏడాది చూపించారు. మొత్తం ఆయన పేరుమీద 40 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నట్లు చూపించారు.