బైక్ నడిపేవారికి మరో బ్యాడ్ న్యూస్ తప్పక తెలుసుకోండి

బైక్ నడిపేవారికి మరో బ్యాడ్ న్యూస్ తప్పక తెలుసుకోండి

0
130

బైక్ నడపడమే కాదు రయ్ మని స్పీడ్ పెంచడమే కాదు ..సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి లేకపోతే బైకర్ కి ఫైన్ పడుద్ది అంటున్నారు పోలీసులు.. ఒకవేళ పోలీసుల నుంచి తప్పించుకున్నా కెమెరాల సాయంతో మీ బండి చలాన్లు ఇంటికే పోస్టల్ లో పంపుతున్నారు. ముఖ్యంగా రవాణా డిపార్ట్ మెంట్ ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు…హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి బైక్ నెంబర్ ప్లేట్ ను ఫోటోలు తీస్తూ.. నేరుగా వారికి ట్రాఫిక్ చాలానాలు పంపుతున్నారు..

దీంతో చాలా మంది బైక్ నడిపేవారు సరికొత్త మోసాలు చేస్తున్నారు.. బైక్ నెంబర్ మార్చి వేయడం, ప్లేట్ విరగ్గొట్టడం, అలాగే వంచెయ్యడం కలర్ మార్చడం ఇలా తప్పులు చేస్తున్నారు అయితే ఇలాంటి తప్పులు చేస్తే ఇక వారు జైలుకే అంటున్నారు పోలీసులు. తాజాగా ఇలాంటి వారికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇకపై నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలపై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 420(మోసం), సెక్షన్ 465(ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేయనున్నారు. .వీటిలో కోర్టు

విచారణలో తప్పు అని నిర్ధారణ అయితే 420 సెక్షన్ కింద 7 ఏళ్లు, 465 కింద 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. అందుకే ఇలాంటి తప్పులు చేసేవారు ఇకనైనా ఇలాంటి మోసాలు తప్పులు

చేయకండి పోలీసులకు చిక్కితే ఇక జైలే గతి.. ముఖ్యంగా వెనుక బండి నెంబరు కనిపించేలా వేయించాలి.. నల్ల అక్షరాలు బోల్డ్ నెంబర్లు వేయిస్తే, ఎప్పుడైనా మీ బండి చెకింగ్ జరిగినా పోలీసులు మిమ్మల్ని ఏమీ అనరు.