నేడు​ బిపిన్ రావత్ అంత్యక్రియలు

Bipin Rawat funeral today

0
116

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు దిల్లీలో శుక్రవారం జరగనున్నాయి. మరికాసేపట్లో కామరాజ్‌ మార్గ్‌లోని రావత్‌ ఇంటికి భౌతికకాయాలను తరలిస్తారు. 11 గంటల నుంచి సైనికాధికారుల సందర్శనకు అనుమతించనున్నారు.

ఆ తర్వాత 2 గంటల నుంచి రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఢిల్లీ కంటోన్మెంట్‌ బ్రార్‌ స్క్వేర్‌ స్మశాన వాటికల్‌..సైనిక లాంచనాలతో బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులు రావత్‌ అంత్యక్రియలకు హాజరవుతారు.