తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నట్లు తెలిపాయి. హెలికాప్టర్ ప్రమాద ఘటనపై పార్లమెంటులో గురువారం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
హెలికాప్టర్ ప్రమాద సమయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు, ఆయన భార్య సహా మొత్తం 14 మంది ఉన్నారు. మృతుల్లో బిపిన్ రావత్ సతీమణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిపిన్ రావత్ పరిస్థితిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బిపిన్ రావత్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రాణాలతోనే ఉన్నట్లు ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.
https://www.youtube.com/watch?v=jugBA-rRmmM&feature=emb_title