2020 అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చింది, అందుకే అన్నీ దేశాల్లో కూడా కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్ కమ్ పలికారు, ఈ ఏడాది అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకున్నారు, కరోనాకి టీకా రావడంతో అందరూ ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అని భావించారు, అయితే ఇలాంటి వేళ పాపం కొన్ని పక్షలు మరణించాయి ఇది అందరిని కాస్త బాధపెట్టింది.
ప్రముఖ పర్యాటక ప్రాంతాలు బాణసంచా మెరుపులతో వెలుగులు జిమ్మాయి, ఇది కొన్ని మూగజీవాలకు శాపంగా మారింది, భారీగా మందుగొండు సామాన్లు కాల్చారు, ఆ నిప్పు రవ్వలకు రోమ్ వీధుల్లో వందల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడ్డాయి.
భారీ శబ్దాలు, మెరుపులు చూసి గూళ్లలో ఉన్న పక్షులు భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా ఎగిరాయి. ఈ సమయంలో ఆ బాంబులు ఆకాశంలో మెరుపు జువ్వలు తగిలి నేలను తాకాయి.. అవన్నీ చనిపోయాయి, కొన్ని ఇళ్లపై పడి మరికొన్ని
విద్యుత్ వైర్లు స్దంభాలపై పడి చనిపోయాయి… రోమ్ రహదారులపై అనేక పక్షులు చలనం లేకుండా పడిపోయి ఉన్న దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జంతు ప్రేమికులను కంటతడి పెట్టిస్తున్నాయి ఈ ఫోటోలు. నిజంగా దారుణం.
Attachments area