కేసీఆర్ కు జన్మదినం – నిరుద్యోగులకు కర్మ దినం

0
81

తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్ట్ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్ జన్మదినం… ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని ప్రశ్నించారు.

జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా అంటూ మండిపడ్డారు.  నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా అని రేవంత్ సూటిగా నిలదీశారు. కేసీఆర్ జన్మదినం. నిరుద్యోగుల ఖర్మ దినంగా మారిందంటూ విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ…కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలి. నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్ తో అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.