హైదరాబాద్ లో ఇక్కడ బిర్యానీ 10 రూపాయలు ఎక్కడంటే

-

సాధారణంగా బిర్యానీ కాస్ట్ ఎంత  ఉంటుంది.. వంద లేదా రెండు వందలు ఉంటుంది, లేదా రోడ్ సైడ్ మనం ఎక్కడైనా బండి మీద ఉంటే బిర్యానీ దాదాపు 80 రూపాయలు కూడా ఉంటుంది..కాని ఇక్కడ మాత్రం బిర్యాని ప్లేట్ పదిరూపాయలు, ఏమిటి ఆశ్చర్యపోతున్నారా ఇది నిజమే, అక్కడ బిర్యానీ కోసం జనం బారులు తీరుతున్నారు, సో అసలు ఆ బిర్యానీ పాయింట్ ఎక్కడ ఉంది అనేది చూద్దాం.
 హైదరాబాద్ లోని అది  అఫ్జల్గంజ్ ఏరియా. ఓ బిర్యానీ షాప్ దగ్గర జనం గుమికూడారు.  అందరూ బిర్యానీ తింటున్నారు, మరి ఇంతకీ ఆ బిర్యానీ పాయింట్ పేరు ఏమిటి అంటే.. అదే అస్కా బిర్యానీ స్టాల్.. మీరు  అఫ్జల్గంజ్ బస్టాప్ దగ్గరకు వెళ్లి… ఈ స్టాల్ పేరు చెప్పి అడ్రెస్ అడిగితే చూపిస్తారు. దాదాపు పది సంవత్సరాలుగా ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు ముందు ఐదు రూపాయలకు ఉండేది ఇప్పుడు పదిరూపాయలు చేశారు.
అంతేకాదు బఠానీ క్యారెట్ దుంపతో కలిపి రెండు రకాల కూరలు ఇస్తారు, ఇక్కడ చాలా మంది కూలీలు సిటికి పనిమీద వచ్చిన వారు చాలా మంది ఇక్కడబిర్యానీ తింటున్నారు, రోజూ సుమారు  1500 బిర్యానీలు అమ్ముతున్నారు… ఇలాంటి బిర్యానీ స్టాల్స్  ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కోటి ఉమెన్స్ కాలేజీ బస్టాప్, అబిడ్స్లోని జనరల్ పోస్టాఫీస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ప్రారంభించి నడిపిస్తున్నారు. అయితే టేస్ట్ అద్బుతంగా ఉంటుంది, ఇక  మీకు ప్యాకింగ్ కావాలి అంటే అరకిలో 30 రూపాయలు బిర్యానీ ఇలా ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతున్నారు…మొదట ఇఫ్తికార్ దీనిని ప్రారంభించారు..
కేవలం  ఒక్కో ప్లేట్కీ రూ.1 లాభం వేసుకుని దీనిని అమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై సస్పెన్షన్ వేటు..!

ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్...

Home Minister Anitha | మాజీ ఎంపీ గోరంట్లకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్

మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ కు ఏపీ హోం మంత్రి అనిత(Home...