బిర్యానీలో ఇనుపతీగ చివరకు కస్టమర్ రెస్టారెంట్ వాడిని ఏం చేశాడంటే

బిర్యానీలో ఇనుపతీగ చివరకు కస్టమర్ రెస్టారెంట్ వాడిని ఏం చేశాడంటే

0
89

ఈ మధ్య బిర్యానీలు తినే సమయంలో అందులో కొన్ని కొన్ని జీవులు దర్శనం ఇస్తున్నాయి.. దీనిపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కు కంప్లైంట్ ఇవ్వడం ఆ హోటల్ కు ఫైన్ వేయడం మళ్లీ ఆ హోటల్ రెస్టారెంట్ తన పని తాను చేసుకుంటూ పోవడం చేస్తూనే ఉన్నాయి, తాజాగా ఇలాంటి ఘటన మరో ఆహర ప్రియుడికి జరిగింది.

హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లికి చెందిన ఓ యువకుడు బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డరు చేసి తింటుండగా, అందులో ఇనుప తీగ వచ్చింది. ఆన్ లైన్ ఫుడ్ యాప్ ద్వారా ఆర్డర్ ఇఛ్చాడు, ఇందులో ఇనుప తీగ రావడంతో పంటికింద తగిలిన దానిని బయటకు తీశాడు అది ఇనుపతీగ అని తెలిసి వెంటనే ఆ యాప్ కు ఫిర్యాదు ఇచ్చాడు. వారు వెంటే సారీ చెప్పి డిస్కౌంట్ కూపన్ ఇఛ్చారు.

తర్వాత అతను జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ట్విట్టర్లో బిర్యానీ అమ్మిన రెస్టారెంట్పై ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూకట్ పల్లిలోని ఈ రెస్టారెంట్ లో తనిఖీలు చేసి ఐదువేల రూపాయల జరిమానా విధించారు. బిర్యానీలో ఇనుపతీగ వచ్చిన ఘటనపై తాను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని ఆవ్యక్తి చెప్పారు. సో జాగ్రత్త ఫుడ్ తీసుకునే సమయంలో ఈ రెస్టారెంట్లు వారి రేటింగులతో పాటు వారు ఎలా వండుతున్నారో వారి సర్వీసు కూడా తెలుసుకోవాలి.