కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రాకు భువనేశ్వర్‌లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు కొందరు కోడి గుడ్లతో దాడి చేశారు. నల్ల బ్యాడ్జ్‌లను ప్రదర్శిస్తూ మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అయితే ఇటీవల జరిగిన లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అజయ్ మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల మధ్య ఒడిశాకు చేరుకున్న కేంద్రమంత్రికి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి నిరసన సెగ తగిలింది.